గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి
మారుతి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.వేకువ జాము నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మహిళా భక్తులు 21 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అనంతరం మారుతి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పెండం శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, ఆలయ అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు,రాజన్ ఆచార్యులు తోపాటు పలువురు గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.






