విధులనుంచి తొలగించిన కారోబార్‌ను ఎలా తీసుకుంటారు..!
కొల్చారం, ఏప్రిల్ 3: మండలంలోని రంగంపేట గ్రామపంచాయతీ లో కరోబార్ గా విధులు నిర్వహిస్తూ ఇంటి పన్నుల వసూలు, వృత్తి వ్యాపార లైసెన్స్ లో జారీ, ఇంటి నిర్మాణ అనుమతులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదు చేస్తున్న రావడంతో గతంలో విధులనుండి తొలగించిన పంచాయతీ కారోబార్ మెతుకు దశరథం ను పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం, గ్రామసభ తీర్మానం లేకుండా ఎలా విధుల్లోకి తీసుకుంటారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి దుర్గేష్ ప్రశ్నించారు.
వెంటనే అతని విధుల్లో నుండి తొలగించకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగం విషయంలో సర్పంచ్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ప్రాధాన్యమిస్తూ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు వార్డు సభ్యులతో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు




