చేయూత ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాలపై విద్యార్థులకు పోటీల నిర్వహణ...
బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వ్యాయామశాల ఆవరణలో ఆదివారం చేయూత గ్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు తాత్పర్యాలపై పోటీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చేయూత గ్రూప్ మంచి కార్యక్రమం నిర్వహించిందని, విద్యార్థులకు భగవద్గీత జ్ఞానం పెంపొందించడానికి తోడ్పడుతుందని అన్నారు. భగవంతుడు చెప్పిన గీత భగవద్గీత అని, విద్యార్థులకు భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా బోడ నరహరి, పిన్నూరి మల్లికార్జున్, పని సత్యనారాయణలు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా పైడిమల్ల లక్ష్మీనారాయణ, హనుమత్ ప్రసాద్, నిర్వాహకులు నందల శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.






