27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

బీజేపీలో ఐదుగురి మధ్య పోటీ

09-10-2025 01:40 AM
  1. జూబ్లీహిల్స్‌కు ఆశావహుల జాబితా సిద్ధం

రాష్ట్ర అధ్యక్షుడికి నివేదిక అందజేసిన త్రిసభ్య కమిటీ

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలిసింది. అభ్యర్థి ఎంపికపై ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ నియోజకవర్గంలోని పలువురి అభిప్రాయాలు.సేకరించి తుది నివేదికను బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు అందజేసింది.

రాంచందర్ రావు ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించి తుది నివేదికను జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ఆ తర్వాత జాతీయ నాయకత్వం పేరును ప్రకటించే అవకాశముం ది. దేశవ్యాప్తంగా పలు చోట్లు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వం అందరి పేర్లను ఒకేసారి ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసిం ది.

జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశిస్తు న్న వారిలో కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ, వీరపనేని పద్మ పేర్లు ముందు నుంచి వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. త్రిసభ్య కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎం పీ పోతుగంటి రాములు, సీనియర్ నేత, అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్న విషయం తెలిసిందే.