28 May, 2026 | 3:42 AM

చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలి

28-05-2026 12:00 AM

ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని చేసిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ 

సికింద్రాబాద్, మే27 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం కుండ సాగుతున్న ఎన్ హెచ్ 44 లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ఉపాధి అవకాశాలను కోల్పోతున్న చిరు వ్యాపారులు, దుకాణ దారులకు  తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.

న్యూ బోయిన్పల్లి లోని సంజీవయ్య నగర్, కృష్ణారెడ్డి నగర్, చిన్నదొకట, కడప్పురా తదితర ప్రాంతాల గుండా సాగే ఎన్ హెచ్ 44 కు ఇరువైపులా చిరు వ్యాపారులు గత నాలుగు దశాబ్దాలకు పైగా చిన్నపాటి వ్యాపారాలను కొనసాగిస్తు, ఉపాధి నీ పొందుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అలాంటి చిరు వ్యాపారులు వ్యతిరేకం కాకపోయినప్పటికీ తమ ఉపాధిని కోల్పోతున్నందున వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ కుటుంబాలు రోడ్డుపాలు కాకుండా చూడాలని జంపన ప్రతాప్ కోరారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఉపాధి అవకాశాలను కోల్పోతున్న చిరు వ్యాపారులు, దుకాణం దారులకు తగిన న్యాయం చేయాలని ప్రతాప్ డిప్యూటీ కలెక్టర్లు కోరారు. చిరు వ్యాపారులకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయమై స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ చూపాలని ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కలెక్టర్ సదరు రహదారికి ఇరువైపులా వ్యాపారాలను కొనసాగిస్తున్న వారి విషయమై సమగ్ర సర్వేను నిర్వహించి నష్టపరిహాన్ని చెల్లించే విషయమై న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రతాప్ తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ను కలిసిన వారిలో వర తోపాటు చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.