30 May, 2026 | 7:35 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

డంపు యార్డును తనిఖీ చేసిన కమీషనర్ ప్రఫుల్ దేశాయ్

30-05-2026 06:27 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య పనుల మెరుగులో భాగంగా శనివారం రోజు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలోని బైపాస్ రోడ్డులో గల  డంపు యార్డును ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగం అధికారులతో కలిసి సందర్శించారు. వ్యర్థాల నిర్వహణ పనుల్లో భాగంగా డంపు యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాలను తొలగింపులో యంత్రాల సహాయంతో కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.

ప్రస్తుతం ఈ ప్రక్రియ ఏ దశలో ఉంది ఎంత మేర వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా నిర్మూలించారనే వివరాలను ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయోమైనింగ్ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్ ప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. అనంతరం  డంపు యార్డులో వ్యర్థాల వల్ల అంతర్గతంగా వాయువుల కారణంగా పలు చోట్ల మంటలను పొగను కమీషనర్ పరిశీలించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు, కాలనీ వాసులకు ఎలాంటి అబ్బందులు  కలగకుండా తక్షణమే పొగను అదుపు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డంపు యార్డులో నిరంతరం పర్యవేక్షిస్తూ... ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించాలని ఆదేశించారు.