30 May, 2026 | 7:34 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

కార్మికుల అసంఘటిత రంగాల కార్మికులకు సిఐటియు అండదండ

30-05-2026 06:31 PM

కొండాపూర్: సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిఐటియు కొండాపూర్ ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల నాయకులు కె రాజయ్య మాట్లాడుతూ సిఐటియు ఆవిర్భవించి 56 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా గ్రామాలలో సిఐటి జెండాలు ఎగురవేయడం కార్మికులు కష్టపడి పని చేసుకుని తమ హక్కులను సాధించే పోరాటంలో సిఐటియు అండదండలుగా ఉండి గత 56 సంవత్సరములుగా కార్మికులకు అసంఘటిత రంగాలలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి హక్కుల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహిస్తూ కార్మికులకు అండదండలుగా నిలబడింది సిఐటియు ఎర్ర జెండా కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని అలాగే కార్మికులకు ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని అలాగే కార్మిక చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ కోడలుగా తీసుకువచ్చింది లేబర్ కోళ్ల వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని కాబట్టి నాలుగు లేబర్ కోళ్ల రద్దు చేయాలని  పోరాటంలో సిఐటియు ముందడుగులో ఉందన్నారు. భవిష్యత్తులో కార్మిక వర్గానికి అన్యాయం చేస్తే అందరము కలిసికట్టుగా పోరాటాలు చేసి మన హక్కులను మనం సాధించేవరకు ఈ పోరాటం చేయక తప్పదు అన్నారు.