30 May, 2026 | 7:35 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత   •   సీఎం రేవంత్ రెడ్డికి చేరిన సిద్ధాపూర్ డంప్ యార్డ్ వ్యవహారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆనందం   •   బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి   •   ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •  

కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి

30-05-2026 06:24 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): దేశంలో కార్మికుల హక్కులు,చుట్టాల పరిరక్షణ కై కార్మికులందరూ ఐక్యంగా పాలక వర్గాలపై ఉద్యమాలు ఉదృతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు పిలుపునిచ్చారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రములోని సిఐటియు గద్దె వద్ద తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కుల శ్రీను జెండా ఎగరవేసి ఘనంగా సిఐటియ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా నిమ్మల మధు మాట్లాడుతూ ఆనాడు పరిశ్రమల యాజమాన్యాల శ్రమ దోపిడీ, వేతనాల దోపిడీకి వ్యతిరేకంగా సిఐటియు ఏర్పాటు అయిందన్నారు.సిఐటియు నిరంతరం కార్మికులకు అండగా ఉంటు అనేక కార్మిక వర్గ పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు.హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు లో అన్ని కానుకలను పెంచి ఇవ్వాలని,స్కీం వర్కర్ల ను ప్రభుత్వ ఉద్యోగులుగా, కనీస వేతనం 26 వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ఐక్య పోరాటాలతో ఎండగట్టాలని అన్నారు.