ఎఫ్‌సీడీఏలో బాధ్యతలు చేపట్టిన కమిషనర్
నూతన కార్యాలయంలో కొలువు తీరిన సిబ్బంది
రంగారెడ్డి, జూన్ 11(విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్(ఎఫ్‌సీడీఏ) అథారిటీ సరికొత్త పాలనా శకానికి నాంది పలికింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అత్యాధునిక నూతన కార్యాలయ భవనంలో, గురువారం నుంచి అధికారిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక్, ఐఏఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది అందరూ నూతన కార్యాలయంలో కొలువుదీరి తమ బాధ్యతలు చేపట్టారు.
ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అంది స్తూ, భవిష్యత్ నగరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించడమే ధ్యేయంగా ఈ సరికొత్త కార్యాలయం నుంచి విధుల నిర్వహణ ఆరంభమైంది. ప్రారంభోత్సవ వేడుక ముగిసిన వెంటనే కమిషనర్ శశాంక్ నూతన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ నూతన భవనం రాబో యే రోజుల్లో ’ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికల అమలుకు, సమర్థవంతమైన పాలనకు ప్రధాన కేంద్రంగా మారనుంది.






