11 July, 2026 | 7:15 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

స్మశానవాటికల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం

02-05-2026 12:00 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): కామారెడ్డిలో స్మశానవాటికల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కామారెడ్డి అభివృద్ధికి సేవ చేసినందుకు ముందుకు వచ్చే వారికి స్వాగతం పలుకుతామన్నారు. కామారెడ్డి సాగర్ సంఘం ప్రజలకు ఈ విషయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైకుంఠధామం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డిని త్వరలో స్వయంగా కలిసి అభినందిస్తామన్నారు. కామారెడ్డి కలెక్టర్ నుంచి ఎన్‌ఓసిపించడానికి అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఎన్‌ఓసిపి ఇప్పిస్తామన్నారు.

గతంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కామారెడ్డి స్మశాన వాటికలా అభివృద్ధికి పట్టించుకోలేదని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఉన్నప్పుడు టు పిట్ కో పండు నుంచి కోటి రూపాయలు విడుదల కాగా, సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పను లు ఆ సంపూర్తిగా నిలిచిపోయాయి  అన్నారు. నీల రక్షణ వహించిన కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీద మహేష్, డిసిసి కార్యదర్శి జూలూరు సుధాకర్, క్రేడా అధ్యక్షులు నర్సా గౌడ్, మాజీ కౌన్సిలర్లు జమీల్, చాట్ల వంశీ, సలీం, కాంగ్రెస్ నాయకులు రంగా రమేష్ గౌడ్, మెహర్ బాబా గౌడ్, నర్సుల మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.