10 April, 2026 | 5:13 AM

వేసవి విడిది కోసం తిమ్మరాజుపల్లి టీవీకి రండి

10-04-2026 01:27 AM

హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ’తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా, దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేశ్ కి థ్యాంక్స్. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది.

అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను.

టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్ లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి‘ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో సాయి తేజ్, హీరోయిన్ వేద జలంధర్, డైరెక్టర్ వి.మునిరాజు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది కూడా మాట్లాడారు.