వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన మోసం
- బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌పీ
- మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
వికారాబాద్, సెప్టెంబర్- 2: వెయ్యి రోజు ల కాంగ్రెస్ పాలన మోసమని, దగా, గోరమని, దానికి నీరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్య ంలో నేడు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర క మిటీ పిలుపుమేరకు బుధవారం వికారాబా ద్ లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ (Former MLA Dr. Methuku Anand) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆయా మ ండలాల నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులతో వ్యవసాయ మార్కెట్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించా రు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చి న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ప్రధాన శా ఖలను తన వద్ద పెట్టుకుని అభివృద్ధికి అ డ్డుగా మారినట్లు ఆరోపించారు. వెయ్యి రో జుల కాంగ్రెస్ పాలనపై పోరాటం చేసేందు కు కేటీఆర్ పిలిపిచ్చిన మరుసటి రోజు ను ంచే రేవంత్ రెడ్డికి చెమటలు పట్టడం ప్రారంభమైందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆయాయంలో ఉద్యోగాలు గుర్తుకొచ్చేవని, ప్రభు త్వ సంక్షేమాలు గుర్తుకొచ్చేవని, పేదలకు ఉన్నత విద్య గుర్తుకొచ్చేదని తెలిపారు.
కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలో యువత ఉద్యోగాలు మరిచిపోయారని, రైతులు వ్యవసాయాన్ని మరిచిపోయే పరిస్థితి దాపురించిందని, ప్రజలకు సంక్షేమం పూర్తిగా దూరమైందని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శుభప్రద పటేల్, పార్టీ మాజీ అధ్యక్షులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలులో విఫలం
మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బి ఆర్ ఎస్ నాయకులు విమర్శించారు. బి ఆర్ ఎస్ పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై జిల్లాలో ఆయా ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ధర్నాతోపాటు బాకీ కార్డులు పంపిణీ చేశారు. భారీ ఫ్లెక్సీ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉప్పల్లో గాడిదలతో నిరసన ప్రదర్శన చేశారు.
ఉప్పల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఘట్కేసర్, మేడిపల్లిలో లో జరిగిన కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మ ల్లారెడ్డి పాల్గొన్నారు. మేడిపల్లిలో మల్లారెడ్డి డాన్స్ చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. షా మీర్పేట్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా రై తు అధ్యక్షుడు అయ్యన్న గారి రవి కిరణ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తూముకుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, మాజీ జెడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపం
రంగారెడ్డి, నెట్‌వర్క్/ సెప్టెంబర్ 2(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, వెయ్యి రోజుల పాలన తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ మోసాలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘420 కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రదర్శ నలు, ధర్నాలు నిర్వహించారు.
చేవెళ్ళలో మండల అధ్యక్షుడు ప్రభాకర్ ఆద్వర్యంలో.. మొయినాబాద్‌లో వెంకట్‌రెడ్డి, షాబాద్‌లో కార్తీక్ రెడ్డి, నవాబ్‌పేట్‌లో దయాకర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ చేపట్టారు.
అమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి సర్ నియోజకవర్గం ఇంచార్జి రజిని సాయి చందు, షాద్నగర్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మహేశ్వరంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరుల నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.






