23 March, 2026 | 5:58 AM

పారిశుద్ధ్యలేమితో కాలనీవాసులు ఇబ్బందులు

23-03-2026 12:00 AM

నాగోల్, మార్చి 22 (విజయ క్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ నివాసితులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, తరచుగా సెవేజ్ బ్లాక్ అవ్వడం వల్ల మురుగు నీరు బయటకు వస్తోందని తెలిపారు.

మా న్హోల్ కవర్లు సరిగా లేకపోవడం వల్ల రోడ్లపై నడవడం, వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిశీలించిన పవన్ కుమార్ వెంటనే స్పందించి ఏఈ స్రవంతికి ఫోన్ చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరా రు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రామారావు, జనరల్ సెక్రటరీ సురేష్ యాదవ్, అమర్, రమేష్, భరత్, కాలనీవాసులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.