బడ్జెట్‌లో బీసీలకు నిరుద్యోగులకు అన్యాయం
రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ బీసీ నేతల మండిపాటు
కుషాయిగూడ, మార్చి 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్ బీఆర్‌ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ, నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ బహుజన వ్యతిరేకమని, ముఖ్యంగా బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగ యువత ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయని ఆరోపిస్తున్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫిస్ ఏఎస్ రావు నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ ఎస్ నాయకులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు కరిపే ప్రవీణ్ (వం జరి), బిఆర్‌ఎస్ పార్టీ బీసీ నాయకులు కనకరాజు గౌడ్ మాజీ కార్పొరేటర్ లు గొల్లూరి అంజయ్య జేరిపోతుల ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.




