27 April, 2026 | 4:23 PM

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

27-04-2026 02:09 PM

ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలి

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): రైతుల నుండి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలంలోని సుగ్లంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ...  రైతులు తీసుకువచ్చే ధాన్యం తప్పనిసరిగా ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని తెలిపారు. కేంద్రాల్లో తూకం, తేమ శాతం కొలతలు సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు.అదేవిధంగా, ధాన్యం మిల్లులకు పంపించే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఓపీఎంఎస్ లో వివరాలు సకాలంలో నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని పిపిసి ఇంచార్జ్‌లకు తెలిపారు.