8 July, 2026 | 12:53 AM

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

08-07-2026 12:03 AM

రాజేంద్రనగర్, జూలై 7(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌kలోని ఈవీఎం  గోడౌన్ను జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మంగళవారం నాడు ఆకస్మికంగా సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఆయన ఈ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు.

గోడౌన్కు వేసిన సీళ్లను నిశితంగా పరిశీలించిన కలెక్టర్.. అక్కడ భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు సహా ఇతర ఎన్నికల సామాగ్రి భద్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడౌన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.