8 July, 2026 | 12:54 AM

ఘనంగా సీత్లా పండగ

08-07-2026 12:03 AM

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనులు మంగళవారం సీత్లా పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి తండాలో గిరిజనులు సామూహికంగా సీత్లా భవానికి పూజలు నిర్వహించారు. వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలు ఆరోగ్యాలతో జీవించే విధంగా చూడాలని వేడుకున్నారు.  మహబూబాబాద్, విజయక్రాంతి