8 July, 2026 | 1:54 AM

బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా మల్లన్న

08-07-2026 12:52 AM

టీఆర్పీ రాష్ట్ర నాయకుల ఘన సన్మానం

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): బీసీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆయనను పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవా రం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల హక్కులు, సంక్షేమం, రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాడుతున్న తీన్మార్ మల్లన్నగారికి ఈ బాధ్యత దక్కడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ కోశా ధికారి కొక్కలకొండ మనోజ్, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, మహిళ వర్కిం గ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న పాల్గొన్నారు.