పదవీ విరమణ సేవలకు మాత్రమే..
రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
ముకరంపుర, జూలై 7 (విజయ క్రాంతి) : నీటి పారుదల శాఖ ఇంజనీర్గా సేవలందించి పద వీ విరమణ పొందిన చొల్లేటి బుచ్చిరెడ్డి సన్మాన సభ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రే యోభిలాషులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, చొల్లేటి బుచ్చిరెడ్డి ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారని, వారి సేవా తపనకు, నిజాయితీకి, మానవీయ వి లువలకు పదవీ విరమణ ఉండదన్నారు.
జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టి ఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇరిగేషన్ ఇంజనీర్ కేవలం కాలువలు నిర్మించే అధికారి కాదని, రైతు ఆశలను సాకారం చేసి వేలాది కుటుంబాల జీవితాల్లో సంతోషాన్ని నింపే మహోన్నత శిల్పి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణరావు, కన్వీన ర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపెళ్లి కాళీచరణ్ గౌడ్,ఇరిగేషన్ శాఖ అధికారులు, ఉద్యోగులు, బంధుమిత్రులు, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






