సీఎం స్వగ్రామంలో అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్
20-05-2026 12:40 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం కొండారెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఏటీసీ సెంటర్, మోడల్ స్కూల్ నిర్మాణాలకు అవసరమైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్, మిల్క్ సెంటర్, పశువైద్య కేంద్రాన్ని సందర్శించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను తనిఖీ చేసి నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచించారు.






