calender_icon.png 12 February, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు

12-02-2026 02:35:39 AM

జనగామ ఫిబ్రవరి 11 (విజయక్రాంతి)జనగాం, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంత వా తావరణంలో ప్రారంభమైంది. పోలింగ్ ప్రా రంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సం ఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డాక్టర్ సయ్యద్ అమ్రిన్ దంపతులుజనగాం లోని సెయింట్ మేరీస్ స్కూల్ లో తమ ఓటు హక్కు ను ఉపయోగించుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్చైర్లు తదితర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించినట్లు తె లిపారు.

పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని అన్నారు.పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుందని, అర్హులైన ప్రతి ఓటరు ఆలస్యం చేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పిలుపునిచ్చారు.