19 June, 2026 | 5:09 PM

Breaking News

పోచమ్మ బోనాల వేడుకల్లో ఏనుగు మనోహర్ రెడ్డి   •   కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్   •   ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •   అన్న-అక్క మెంటార్‌షిప్ శిబిరం   •   చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

పాఠం చెప్పి.. భోజనం చేసిన కలెక్టర్

19-06-2026 03:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం దిల్వార్పూర్ కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ పరిసరాలను పరిశీలించారు. వంట గదిలోకి వెళ్లి కూరగాయలను చూశారు. తరగతి గదిలోకి వెళ్లి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశం బోధించి ప్రశ్నలకు జవాబులు రాబట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని సామూహిక భోజనం నిర్వహించారు. కస్తూరిబా పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పిల్లల మౌలిక వసతులపై ఎస్ఓ అపర్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అధికారులు పాల్గొన్నారు