22 April, 2026 | 2:43 AM

ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం

22-04-2026 01:03 AM

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలనప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందన్నారు. వివిధ శాఖల అధికారులు తమ తమ విభాగాల పరిధిలో చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని చెప్పారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు కూడా విజయవంతంగా సాగాయని పేర్కొన్నా రు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డిపిఆర్‌ఓ విష్ణు వర్ధన్, డీపీఓ శ్రీనివాస్, ఆర్టిఓ ర్గాప్రసాద్, వైద్య శాఖ అధికారి సౌమ్య, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈవీఎం గోదాంను తనిఖీ 

కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్, చీఫ్ ఎలెక్టోరల్ కార్యాలయ ఈవీఎం రాష్ట్ర నోడల్ అధికారి బి. హరిసింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీసు సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈవీఎం గోదాం తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, బిజెపి, టీడీపీ, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు కోరిపల్లి శ్రవణ్ రెడ్డి, సిరికొండ రమేష్, హైదర్, మజార్, ముజాయిద్ అలీ పాల్గొన్నారు.