20 May, 2026 | 1:34 AM

చికిత్స కోసం రూ.లక్ష ఎల్‌ఓసీ

20-05-2026 12:16 AM

రాగుల సతీష్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరు

మంథని, మే19 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గం, రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన రాగుల సతీష్ గత కొంతకాలంగాయ అనారోగ్యంతో బాధపడు తూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆర్థిక పరిస్థితి తగని కారణంగా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాల్సిందిగా బాధితుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను ఆశ్రయించారు. బాధితుడి పరిస్థితిపై తక్షణమే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 1,00,000 ఒక లక్ష రూపాయలను మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ ఓసీ నిధి పత్రాన్ని హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలోమంత్రి ఆస్పత్రి సహాయకులు బాధితుడి కుటుంబ స భ్యులకు అందజేశారు.

మంత్రికి కృతజ్ఞతలు

తమకు అత్యంత క్లిష్టసమయంలో రూ. లక్ష ఎల్‌ఓసీ మంజూరు చేయించి పెద్ద దిక్కుగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు బాధితుడు రాగుల సతీష్ వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.