28 August, 2026 | 4:28 AM

హెచ్‌ఎండీఏను సందర్శించిన సీఎండీఏ బృందం

28-08-2026 12:24 AM

పట్టణ ప్రణాళిక కార్యక్రమాలపై అధ్యయనానికి వచ్చిన ప్రతినిధులు  

హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): పట్టణ ప్రణాళిక, అభివృద్ధి రంగంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అ థారిటీ(Hyderabad Metropolitan Development Authority,) (హెచ్‌ఎండీఏ) అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు,ఉత్తమ విధానాల ను అధ్యయనం చేసి అవగాహన పొందేందుకు చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) ప్రతినిధుల బృందం గురువారం హెచ్‌ఎండీఏని సందర్శించింది. ఈ ప్రతినిధుల బృందంలో తమిళనాడు ఆ ర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్. వెంకటేష్, మాస్టర్ ప్లాన్ యూనిట్(ఎంపీయూ) సీనియర్ ప్లానర్ ఆర్‌కే వేదవతి, అసిస్టెంట్ ప్లాన ర్ సెంథిల్ కుమారన్ ఉన్నారు.

సందర్శన సందర్భంగా ప్రతినిధుల బృందం హెచ్‌ఎండీఏ అధికారులతో పట్టణ అభివృద్ధి నిబంధ నలు, ప్రణాళికా విధానాలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించింది. ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ), డెన్సిటీ ని యంత్రణ విధానాలు, భవన నిర్మాణ నిబంధనలపై చర్చ జరిగింది. అధ్యయన పర్యటన లో మరో ప్రధాన అంశంగా పట్టణ ప్రణాళిక, భవన అనుమతుల ప్రక్రియల డిజిటలై జేషన్ పై ప్రతినిధుల బృందం దృష్టి సారించింది.

సమావేశంలో హెచ్‌ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జా యింట్ మెట్రోపాలిటన్ కమిషనర్(జనరల్) అండ్ సెక్రటరీ(ఎప్‌ఏసీ) శ్రీనివత్స కోట, సీనియర్ ప్లానింగ్ అధికారులు, టీసీపీ బృందా ల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా హెచ్‌ఎండీఏ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ కె విద్యా ధర్, రాజేంద్ర ప్రసాద్ నాయక్, కె వికాస్, ప్రసాద్‌రావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గోపిక రమ్య, ప్లానింగ్ ఆఫీసర్లు శాలిని, రాహుల్, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్లు సురేష్, సుధ, రాధాబాయి, శిరీష, అసిస్టెంట్ డైరెక్టర్, డీటీసీపీ  ప్రేమ్సేన్ గుప్తా, ఎన్‌ఐఎస్‌జీ పి రిషిత్, ఉదయ్ రెడ్డి తదితరుల బృంద సభ్యులు పాల్గొన్నారు.