calender_icon.png 22 February, 2026 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ల రాజేష్ లాకప్ డెత్‌పై సీఎం స్పందించాలి

22-02-2026 12:03:48 AM

రాజేష్ మృతికి కారకులైన చిలుకూరి ఎస్సై సురేష్‌రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి

మృతుని కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి

మందకృష్ణ మాదిగ డిమాండ్

సికింద్రాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశా రు. కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగి 95రోజులు గడుస్తున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు.

ఈ మేరకు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద  ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ కమిషన్ స్పందిం చి లాకప్ డెత్‌కి కారకులైన ఎస్‌ఐని సస్పెండ్ చేసి, రీ పోస్టు మొత్తం నిర్వహించాలని డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఆదేశాలిచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఎస్సై సస్పెండ్ చేయలేదని, రీపోస్ట్ మార్టం నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజేష్ మృతికి కారకులైన చిలుకూరి ఎస్సై సురేష్‌రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేసి, మృతుని కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్‌గ్రేషియా అందించి, కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సై సురేష్ రెడ్డిని మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి కాపాడుతున్నాడని మండిపడ్డారు.

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిం దు నరేష్ మాదిగ, ఎమ్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాది గ, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ, వేముల ఎల్లయ్య మాదిగ, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు మం ద రాజు మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ మాదిగ, ముప్పూరి పురుషో త్తం మాదిగ, దావు ఆదిత్య మాదిగ, ఈదుల రాజీవ్ ప్రదీప్ మాదిగ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్‌ఎఫ్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు  పాల్గొన్నారు.