1 September, 2026 | 9:10 PM

యూరియా యాప్ వద్దు.. రోడ్డెక్కిన రైతన్నలు

01-09-2026 | 07:36pm

కామారెడ్డి జిల్లా పాల్వంచలో రైతుల ఆందోళన

కామారెడ్డి,(విజయక్రాంతి): యూరియా యాప్ వద్దని రైతులు రోడ్ ఎక్కారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) పాల్వంచ మండల కేంద్రంలో సిరిసిల్ల కామారెడ్డి రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా బుకింగ్(Urea Booking) కోసం తీసుకొచ్చిన సెంట్రల్ యాప్ రైతులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బుకింగ్ కావడంలేదని సర్వర్ డౌన్ అవుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు విక్రయ కేంద్రాల్లో 444 యూరియా బ్యాగుల చొప్పున 3108 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సోషల్ మీడియాలో సోమవారం సమాచారం అందించారు.

మంగళవారం ఉదయం నుంచి యూరియా బుకింగ్ చేసుకునేందుకు రైతులు(Farmers) ఎంత ప్రయత్నించినా పదేపదే సాంకేతిక సమస్యలు తల ఎత్తడంతో  రైతులు ఆగ్ర హమ్మ్ వ్యక్తం చేశారు. ఒకవైపు పంటకు యూరియా అత్యవసరం కావడంతో మరోవైపు యూరియా అవసరం అత్యవసరంగా ఉండడంతో మరోవైపు బుకింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రైతులు గంటల తరబడి ఫోన్లో నిరీక్షించాల్సి రావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.