ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
- నేడు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలతో భేటీలు
- రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి
- 17 నుంచి సెప్టెంబర్10 వరకు విదేశీ పర్యటనలు
- రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ఎజెండాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అయిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ, మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన కేంద్ర నిధులు, అనుమతులపై సం బంధిత కేంద్ర మంత్రులతో చర్చించనున్నా రు. రాష్ట్ర విభజన హామీలు, బడ్జెట్ నిధులపైనా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాను త్వరితగతిన విడుదల చేయాలని కోరనున్నారు. జాతీయ రహదారుల విస్తరణ, ప్యాకేజీలతోపాటు పండిన పంటలకు మద్దతు ధర, ఎరు వుల సరఫరా వంటి అంశాలపై మంత్రుల తో భేటీ కానున్నారు. చివరగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం, పార్టీ పనితీరు ఇతర సమస్యలపై చర్చించనున్నారు.
విదేశాలకు..
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్ల నున్నారు. ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 10 యూకే, అమెరికా, జర్మనీ, చైనాలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటించనున్నది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులతోపాటు విదేశీ వర్సిటీలు, క్రీడలు, శిక్షణ సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. అదే విధంగా యూకే, అమెరికాలోని ప్రముఖ వర్సిటీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను సీఎం సందర్శించనున్నారు.
తెలంగాణలో ఉన్నత విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశమై పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని విదేశీ వర్సిటీలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆ సక్తి చూపు తున్న నేపథ్యంలో, మరిన్ని ప్రము ఖ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే స్కిల్స్ వర్సిటీ ఏర్పాటైన నేపథ్యంలో, అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలను తెలంగా ణకు తీసుకురావడంపై కూడా ఈ పర్యటనలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
క్రీడాభివృద్ధికి కొత్త ప్రణాళికలు..
తెలంగాణ యువత ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించాలని రేవంత్‌రెడ్డి పలుమార్లు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలు, శిక్షణా కేం ద్రాలను సందర్శించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మౌలిక వసతులు, శిక్షణా వ్యవస్థలను అభివృద్ధి చేసే అంశాలపై నిపుణులతో చర్చించే అవకాశమున్నది.






