19 March, 2026 | 3:39 PM

కొత్త పార్టీ ఏర్పాటు.. ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట

19-03-2026 02:18 PM

హైదరాబాద్: పార్టీ నమోదు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఈసీకి సూచించింది. తెలంగాణ ప్రజా జాగృతిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని ఈసీ(Election Commission) గతంలో కోర్టుకు తెలిపింది. లోపాలన్నీ సరిచేసినట్లు కవిత తరుఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సాంకేతిక తప్పులు సరిచేసి  ఈసీకీ మళ్లీ దరఖాస్తు చేశామని కవిత లాయర్లు తెలిపారు. కవిత కొత్త పార్టీ( Kavitha New Party) దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ త్వరగా నిర్ణయం తీసుకొంటామనడంతో ఢిల్లీ హైకోర్టు విచారణను ముగించింది.