17 July, 2026 | 8:32 PM

Breaking News

పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •  

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

18-03-2026 01:33 PM

2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై(Moinabad drug case) సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారని తెలిపారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో తమ ప్రమేయం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సిట్ వేశామని చెప్పారు. 2029లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయని ఆయన వెల్లడించారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.