21-02-2026 02:50:29 PM
హైదరాబాద్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో(Asifabad Municipality) కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహపై అనర్హత వేటు పడింది. విప్ ధిక్కరించి బీఆర్ఎస్ కు ఓటేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహపై వేటు పడింది. ఈ నెల 16న పురఎన్నికలో స్నేహ ఓటుతో ఛైర్మన్ సీటును బీఆర్ఎస్ పార్టీకి చెందిన మెంగ్రె ఆకాస్ కైవసం చేసుకున్నారు. ఒక ఓటు తేడాతో కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి అబ్దుల్లా ఓడిపోయారు. స్నేహ తిరుగుబాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధికారులను ఆశ్రయించింది. విప్ ను ధిక్కరించి ఓటేసిన స్నేహ సభ్యత్వాన్ని అధికారులు రద్దు చేశారు.