22 April, 2026 | 11:01 AM

RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత

22-04-2026 09:35 AM

కదలని ప్రగతి రథచక్రం 

ఈ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

RTC సమ్మెతో తెలంగాణలో బస్సులు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC Strike Begins) Telangana State Road Transport Corporation కార్మికుల సమ్మెతో జిల్లాలో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయితెల్లవారు నుంచే డిపోల ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెకు దిగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 9 డిపోల వద్ద సమ్మె ప్రారంభించారు.

 జిల్లా తాజా వార్తల కోసం జిల్లా పేజీని సందర్శించండి.

కార్మికులు సమ్మెకు దిగడంతో మొత్తంగా వెయ్యికి పైగా ఆర్టీసీ, అద్దె బస్సులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. రీజియన్ పరిధిలో ఆర్టీసీ రెగ్యులర్ సిబ్బందితోపాటు 600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తంగా 3,900 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు తీయలేదు. డ్రైవర్లు, కండక్టర్లు , కార్మికులు విధులు బహిష్కరించి ఆర్టీసీ బస్టాండులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని న్యూస్ అప్‌డేట్స్ కోసం ఈ విభాగాన్ని చూడండి.


ఇవి కూడా చదవండి: