18 March, 2026 | 5:09 PM

రేవంత్ ఢిల్లీ పర్యటన — రాహుల్, ప్రియాంక, ఖర్గేతో కీలక భేటీ!

18-03-2026 01:26 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రయాంక గాంధీని కలిశారు. వేం నరేందర్ రెడ్డిని ఇరువురు నేతలకు రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవల వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను వెంట తీసుకుని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిశామని సీఎం పేర్కొన్నారు. వేం నరేందర్ రెడ్డిని ఖర్గే అభినందించారని తెలిపారు.. ఈ భేటీలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ పాల్గొన్నారు.