calender_icon.png 5 February, 2026 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం

05-02-2026 05:27:35 PM

బీఆర్ఎస్, బీజేపీ బంధం.. ఫెవికాల్, వీణా-వాణి బంధం

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం చొప్పదండిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ... కేంద్రంలో ప్రభుత్వం కోల్పోయినా మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియాగాంధీ(Sonia Gandhi) ఈ గడ్డపై నుంచి మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఏపీలో పార్టీ అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కున్నా మాట తప్పలేదన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చినా.. బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని రేవంత్ తెలిపారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరసావహిందన్నారు.

పదేళ్లలో పన్నుల రూపంలో రూ. 20 లక్షల కోట్లు ప్రజలు ప్రభుత్వానికి కట్టారని వివరించారు. పదేళ్లలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కూడా కట్టించలేదని ధ్వజమెత్తారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన అందిస్తుంటే విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని కుటుంబం మొత్తం దాడికి దిగుతోందన్నారు. ఏడాదికి 2 లక్షల ఇళ్లు కట్టినా పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టే పరిస్థితి ఉండేదన్నారు. ఉచిత కరెంట్(Free electricity) దేశానికి ఆదర్శమైంది.. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. పాలమూరు జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ను(BJP National president) ప్రచారానికి తీసుకువచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో(Municipal elections) ప్రచారానికి ప్రధాని సహా దేశం మొత్తం  నేతలను తీసుకురండని సవాల్ విసిరారు.

బీజేపీ అందిరినీ ప్రచారానికి తెచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో బీజేపీకి చూపిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని మోదీ చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. మూడుసార్లు మోదీ ప్రధాని అయినా పాలమూరును జాతీయ ప్రాజెక్టు చేయలేదన్నారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు(Kaleshwaram National Project) ఇవ్వలేదు.. మెట్రో, మూసీకి నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ పూర్తిపైస్పష్టత లేదు.. ఏం ఇవ్వడానికి ఢిల్లీ నేతలను తెచ్చారని సీఎం ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు గాడిద గుడ్డు తెచ్చారు తప్ప అణాపైసా ఇవ్వలేదని సీఎం వెల్లడించారు. బీజేపీ హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ బంధం.. ఫెవికాల్, వీణా-వాణి బంధం కాదా అన్నారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసిందని ఆరోపించారు. ఓట్లు, సీట్లు బీఆర్ఎస్ దానం చేసి 8 చోట్ల బీజేపీ ఎంపీలను(BJP MPs) గెలిపించారని తెలిపారు. ఎనిమిది చెట్ల డిపాజిట్లు కోల్పోయినా తామే గెలుస్తామని బీఆర్ఎస్ రంకెలేస్తోందన్నారు. కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చారని మోదీ, అమిత్ షా స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. కాళేశ్వరం పై కమిషన్ వేసి నిందితులను అరెస్టు చేయాలని అసెంబ్లీలో నిర్ణయించామన్నారు. అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపిస్తే ఇప్పటికీ సీబీఐ విచారణ చేపట్టలేదని సీఎం వెల్లడించారు.