6 July, 2026 | 2:24 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా

05-02-2026 05:47 PM
  1. ప్రభుత్వ స్థలాలను కబ్జాకు పాల్పడితే.. కటకటాలపాలే  
  2. ప్రభుత్వ భూమిని కాపాడిన... రెవెన్యూ అధికారులు
  3. కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్కారు స్థలాలు కబ్జాచేయాలని చూస్తే కటకటాలపాలే అవుతారని, అమాయకపేదలకు ప్రభుత్వ భూములు ప్లాట్లుగా చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్న కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ లోని సర్వే నెం. 696లో సుమారు 20గుంటల భూమి అన్యాక్రాంతం అవుతుందని తెలుసుకుని... కాప్రా తహసీల్దార్ రాజేశ్ ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో ఫెన్సింగ్ వేసి కాపాడారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కోట్ల రూపాయాల విలువైన భూమిని కాపాడి కంచె ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.