15 June, 2026 | 6:32 PM

Breaking News

దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •   ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •  

సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం

25-02-2026 12:54 AM

కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 24, (విజయక్రాంతి): రాష్ట్ర యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్  రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో జిల్లా నుండి పాల్గొన్న క్రీడాకారులు వివిధ క్రీడా విభాగాలలో ప్రతిభ కనబరచి మొత్తం 54 పతకాలు సాధించడం విశేషమన్నారు.

ఈ సందర్భంగా మంగళవారం ఐడీఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పతక విజేతలను అభినందించి, వారి కృషిని ప్రశంసించారు. క్రీడాకారులు సాధించిన 15 బంగారు, 19 వెండి, 20 కాంస్య పతకాలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని తెలిపారు. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలోనే 31 పతకాలు సాధించడం జిల్లాలో క్రీడా అభివృద్ధి దిశగా సానుకూల పరిణామమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన యువ క్రీడాకారులు కూడా సమానంగా ప్రతిభ చాటుకోవడం అభినందనీయమని, క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని కలెక్టర్ అన్నారు.

జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యం. పరంధామ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్, కొమరారం వెంకటనారాయణ (ఏఎస్‌ఓ, ట్రైబల్ వెల్ఫేర్), బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ మట్టపర్తి రమేష్, టైక్వాండో సెక్రటరీ రమేష్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరామిరెడ్డి, మంజిలాల్ (పీడీ), నాగలక్ష్మి (పీడీ), చైతన్య (పీడీ), వాసు, నాగేందర్, నాగరాజు, మాలికార్జున్, గిరిప్రసాద్, కావేటి రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.