ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించిన విద్యార్థుల సన్మానంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): సీఎం కప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాణించిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక అభినందనలు తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలలో రాణించిన విద్యార్థులను సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ... సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీలలో పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్లిన 22 మంది విద్యార్థులు 4 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 10 కంచు పతకాలు గెలుచుకున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, పేట ప్రెసిడెంట్ సురేందర్, పేట రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభరాణి, ఆర్చరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్, వివిధ క్రీడల కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.




