3 March, 2026 | 8:38 PM

మల్లన్న ఆలయ మూసివేత

03-03-2026 04:46 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): చంద్రగ్రహణం సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఆలయ అర్చకులు మంగళవారం ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం  ద్వారబంధనం చేశారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధాలయాలు కూడా మూసి వేశారు. సాయంత్రం 7.30 గంటల వరకు మూసి వేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాల తర్వాత దేవాలయం అంతట సంప్రోక్షణ జరిపిన తర్వాత ప్రదోష పూజ, మహా నివేదన కార్యక్రమం అనంతరం దర్శనాలు, ఆర్జిత సేవలు  యధావిధిగా కొనసాగుతాయని  వారు తెలిపారు.