8 May, 2026 | 1:46 PM

పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం

08-05-2026 12:50 PM

పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వనమా రాఘవేందర్

ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు 

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పాల్వంచ మండలం పుల్లాయి గూడెం గ్రామం లో నూతన రామాలయ ప్రారంభోత్సవం, విగ్రహ , ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ  కార్యక్రమంలో  వనమా రాఘవేందర్ శుక్రవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం అనంతరం వనమా రాఘవేందర్ మాట్లాడుతూ ఇంతటి మహోత్సవ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని రాములవారికి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉంటాయని, రామాలయ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కనగాల బాలకృష్ణ,  పార్టీ పాత పాల్వంచ ఇంచార్జ్ ముత్యాల ప్రవీణ్,  మండల మాజీ అధ్యక్షులు పూసల విశ్వనాథ, 39వ డివిజన్ కార్పొరేటర్ గోవాడ గుణచరిత్,38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, 32వ డివిజన్ కార్పొరేటర్ గుగులోత్ రాంబాబు,  తదితరులు పాల్గొన్నారు