8 May, 2026 | 1:55 PM

కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ

08-05-2026 12:48 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddyవికారాబాద్ జిల్లా కొడంగల్‌లో శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి కొడంగల్‌లో పర్యటిస్తున్నారు. కొడంగల్ లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారు. కొడంగల్‌లో రూ. 110 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం పనులను  ప్రారంభించారు. భూమి పూజలో మంత్రులు దామోదర రాజనరసింహా, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.