8 May, 2026 | 1:46 PM

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

08-05-2026 12:51 PM

సర్పంచ్ సి.హెచ్. సతీష్ 

వాంకిడి, (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని వాంకిడి సర్పంచ్ సి.హెచ్. సతీష్ పేర్కొన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీ పరిధిలోని 7వ వార్డులో పూడిక తో నిండిన మురికి కాల్వలను పారిశుధ్య కార్మికులతో పూడికతీత పనులను చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రజలు తడి, పొడి చెత్తను వేరువేరుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని ఆయన సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు.