3 March, 2026 | 7:21 PM

జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు

03-03-2026 04:49 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ లో అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని 278 ఫ్లాట్లకు చెందిన నివాసితులు లాన్ చేరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంగు రంగుల వేదిక కింద షవర్ల కింద నీటిలో తడుస్తూ ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వర్ణకుమార్, కోశాధికారి నవీన్ కుమార్, ఉపాధ్యక్షురాలు నాగ కుమారి, సహాయ కార్యదర్శులు మమత, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.