3 March, 2026 | 5:15 PM

మూగ జీవానికి వైద్యం అందించిన విజయ్

03-03-2026 03:49 PM

మానవత్వానికి నిదర్శనం లక్ష్మీకాంతారావు

సత్తుపల్లి,(విజయక్రాంతి): మానవత్వానికి నిదర్శనంగా, పద్మనాభుని లక్ష్మీకాంతారావు కాగా, ప్రాణాపాయస్థితిలో ఉన్న మూగ జీవానికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన విజయ్ కుమార్ సమాజంలో నిలువెత్తుగా, నిదర్శనంగా నిలిచారు. వివరాలు ఇలా... కాకర్లపల్లి రోడ్ లో గల పద్మనాభుని లక్ష్మీకాంతారావు కిరాణా షాపులో సోమవారం సాయంత్రం చిన్న వానరం పిల్ల కరెంట్ షాక్ గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుచున్నది. గమనించిన కిరణా షాప్ యజమాని దానిని తన గదిలోకి తీసుకొచ్చి, క్రింద మ్యాట్ వేసి, దానికి కొంచెం ఆహారం ఏర్పాటు చేశారు.

తెల్లవారి గమనించిన కాంతారావు వానరం ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో, వెంటనే వెటర్నరీ అసిస్టెంట్ చేపల విజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన విజయ్ వానరానికి వైద్యం అందించి, ఆహారాన్ని అందించి,ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినారు. మూగ జీవానికి ఉచితంగా వైద్యం అందించి ప్రాణాలు కాపాడడం పట్ల పలువురు వారిని అభినందించారు. నాకెందుకులే అని అనుకుంటే ఆ మూగజీవ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన పనికి ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారు అయినారు. ఏది ఏమైనా మానవత్వం బ్రతికే ఉన్నది అనటానికి ఇదే నిదర్శనం.