calender_icon.png 23 February, 2026 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత

23-02-2026 12:36:46 AM

మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి);: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని  మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది గారు అన్నారు. హారదేవ్ సింగ్ జి మహరాజ్ జయంతి సందర్భంగా నిరంకారి మిషన్, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అమృత్లో భాగంగా ఆదివారం స్థానిక మినీ ట్యాంక్బండ్ వద్ద ‘స్వచ్ జల్‌స్వచ్ మాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రాగునీరు స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడబడుతుందని అందుకే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు పాటుపడాలన్నారు. స్వచ్ జల్, స్వచ్ మాన్ వంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

సమాజంలో ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట సంయోజక్ సరళ, 29 వ వార్డు కౌన్సిలర్ రాపర్తి.భవాని శ్రీనివాస్, ఎన్విర్వాల్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, జవాన్ వేణు, నర్సింహారెడ్డి,ఎం. విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.