31 July, 2026 | 3:27 AM

ప్రశాంతంగా ఉంటే చర్చిద్దాం!

31-07-2026 01:32 AM

ఎంపీ కంగనాకు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ కౌంటర్

న్యూఢిల్లీ, జూలై 30: దేశభవిష్యత్ తరాలను, యువతను బీజేపీ ఎంపీ, నటి కంగనా రౌనత్ విమర్శిస్తున్నారని, తనను పనికిరానివాడు, నిరుద్యోగి అని అంటున్నారని, కాస్త ప్రశాంతంగా ఉంటే మాట్లాడుకుందామని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ గురువారం ఆమెకు ఓ ప్రకటనలో సలహాఇచ్చారు. తనకు కంగనాపై వ్యక్తిగత ద్వేషం లేదని, ఆమెతో గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదని, ఏవైనా విభేదాలుంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు.

గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇలాంటి తప్పుడు సమాచారమే వస్తుందన్నారు. దేశంలో చర్చలు, సంభాషణలు తగ్గిపోవడం పెద్ద సమస్యగా మారిందని, పరస్పర గౌరవంతో చర్చించుకునే వాతావరణం ఉండాలని తన అభిప్రాయమంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కంగనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏదైనా మాట్లాడాల్సి ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని తనకు ఆమెతో మాట్లాడటం, చర్చించడం, సంభాషించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని సౌరవ్ స్పష్టం చేశారు.