కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం
- మండల అధ్యక్షుడిపై ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకం
- అతనిపై మక్కువ ఎందుకుఅంటు ప్రశ్నల వర్షం
- ఏండ్ల తరబడి వారే ఉంటే మేమెందుకు అంటూ మండిపాటు
- ఇప్పటికే మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా
- మరింత మంది నేతలు రాజీనామాకు సిద్ధం
- టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుని కలిసేందుకు సమయత్తం
మహమ్మదాబాద్, మే 15 : అధికార పార్టీ అడ్డదిడ్డంగా అడుగులు వేస్తుందని మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ నేతలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గెలిచేందుకు సహాయశక్తులుగా కృషి చేసిన నేతలకు భంగపాటు కలిగిస్తున్నారని మండల కాంగ్రెస్ నేతలు అంతర్లింగంగానే కాకుండా బహిరంగంగా కూడా విమర్శలు చేస్తుండ్రు.
అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పై అసంశక్తి వ్యక్తం చేస్తూ ఇటు పార్టీకి అటు పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు కొంతమంది నేతలు సమయతమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణాలు లేకపోలేదు. గత ఏడేళ్ల నుంచి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని యధావిధిగా కొనసాగించడం పై కాంగ్రెస్ పార్టీ నేతలలో ఆ పదవి ఆశించిన నాయకులతోపాటు మద్దతుదారులు సైతం అసంతృప్తి గా ఉన్నారు.
రేపు మా పో మాకు గుర్తింపు వస్తుంది చేసిన కష్టం వృధా పోదు అనుకున్న నేతలకు ఆశించిన మేరకు పార్టీ గుర్తించలేదని వారు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండ్రు. దీంతో అధికార పార్టీ అయినప్పటికీ నియమ నిబంధనలను పాటించడం లేదని ఆ పార్టీలో ఉండవలసిన అవసరం లేదని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్ గా పార్టీ క్యాడర్ నడుస్తున్నప్పటికీ మండల వ్యాప్తంగా ఈ చర్చ తీవ్ర ఊపందుకుంది.
- సంతకాల సేకరణకు స్పందన కరువైంది..
ఎట్టి పరిస్థితుల్లో మండల అధ్యక్షుడిని మార్చాలంటూ మహమ్మద్ మండల కాంగ్రెస్ నేతలు కొంతమంది కార్యకర్తలు నాయకులను కలిసి సంతకాల సేకరణ చేసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి అందజేశారు. అయినప్పటికీ మిగతా మండలాలలో మండల అధ్యక్షులు బాధ్యులను మార్చినప్పటికీ ఒక్క మహమ్మదాబాద్ మండలంలో ఎందుకు మార్చడం లేదంటూ మండల పార్టీ నేతలు కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పనులు ఏమైనా అధికారం ఎవరిది ఉన్న పని చేసే వారికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందని వారు పేర్కొంటూ ఉండడం విశేషం. న్యాయం జరగదు అనుకున్నప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉండాలంటూ మరి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ అందరం కలిసి బయటికి వెళ్దామా?ఒక్కొక్కరిగా వెళ్దామా?అనే చర్చ జరుగుతుంది.
- ఆ మండల అధ్యక్షుడిపై ఎమ్మెల్యేకు అభిమానం ఎందుకు
మహమ్మదాబాద్ మండలం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గత ఏడేళ్ల నుంచి చేసినప్పటికీ యధావిధిగా కొనసాగించడంపై నేరుగా ఎమ్మెల్యేని మండల కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ మండల అధ్యక్షుడు పై ఎందు కంత అభిమానం అంటూ ఘాటైనా వ్యాఖ్య లు చేస్తూ మేము ఆ పోస్ట్ కు అర్హులమం టూ చెప్పడంతో మరింత చర్చ ఊపందుకుంది.
టి పి సి సి అధ్యక్షునికి సైతం తమ ఫిర్యాదును అందజేస్తామని పార్టీ నియమ నిబంధనలను ఉల్లగించి యధావిధి కాకుం డా సాగిస్తే మేము ఎందుకు ఉండాలి పార్టీ లో అంటూ కొంతమంది ప్రశ్నించడంతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చతికిలప డే అవకాశాలు మెండుగా గా ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ఆసరాగా చేసుకునే అవకాశాలు ఉండడంతో భవిష్యత్తులో మండల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎటువైపు నిలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.






