10 April, 2026 | 1:42 AM

కామారెడ్డిలో కరెన్సీ చోరులు!?

10-04-2026 12:00 AM
  1. జనావాసాలలో నిలిపిన వాహనాలే టార్గెట్..
  2. బైకులు, కార్లు ధ్వంసం చేసి పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముఠా..
  3. గతంలో బాన్సువాడ, నాడు బోధన్‌లో.. నేడు ఎల్లారెడ్డిలో వరుస చోరీలు..
  4. వరుస ఘటనాలతో ఆందోళనకు గురవుతున్న జనం..
  5. వరుస చోరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపేనా..?

బాన్సువాడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ చోరీ మాఫియా పెట్రేగిపోయింది. చాకచక్యంగా లక్షలు సొమ్మును దోచుకెళ్ళి పోతున్నారు. జనవాసంలో నిలిపిన కార్లు ద్విచక్ర వాహనాలు టార్గెట్గా కరెన్సీ చోరీ ముఠా చోరీలకు పాల్పడుతూ దోచుకెళ్తున్నారు. పట్టపగలే కారు అద్దాలు ధ్వంసం చేసి ద్విచక్ర వాహనాల్లో ఉంచిన డబ్బులను జనాలను ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలు లేకపోలేదు.

పట్టపగలే చోరీలు జరుగుతున్న ముఠా పోలీసులకు ఇప్పటివరకు చిక్కకపోవడం గమనార్హం.గత నెల క్రితం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో  స్మార్ట్ బజార్ ముందు 12 లక్షల రూపాయల చోరీకి పాల్పడిన విషయం విధితమే. గత కొన్ని రోజుల క్రితం జాహిరాబాద్ లో కూడా సంఘటనను మర్చిపోకముందే బోధనలో మరో కరెన్సీ చోరీ జరగడం సంచలనంగా మారింది. కరెన్సీ చోరీ మాఫియా పోలీసులకు సవాల్ గా మారారు.

ఫిబ్రవరి 17న కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడుకోల్ చౌరస్తా వద్ద ఎస్బిఐ బ్యాంకు నుండి బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు డబ్బులు డ్రా చేసి తన కార్లో పెట్టి, పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కు వెళ్లి వచ్చేసరికి కారు అద్దాలు సులువుగా తొలగించి 8 లక్షల నగదు బ్యాగ్ ను దొంగలించుకొని పారిపోయారు. ఇప్పటికీ దొంగలు ఎవరు? అంతరాష్ట్ర దొంగల ముఠాన, లేక స్థానికులైన ఈ దొంగతనాలకు పాల్పడుతుంది అన్నది ఇప్పటివరకు పోలీసులు చేదించలేదు.

ఇది జరిగి నెల రోజులకే మార్చి 17న మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్బిఐ బ్యాంక్ గురించి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకుని తన బైక్ డిక్కీలో పెట్టుకొని, బయటకు పోయి వచ్చేసరికి 8 లక్షల రూపాయలు దొంగలు దొంగలించుకొని పారిపోయారు. ఇప్పటికీ ఈ దొంగతనానికి పాల్పడింది దొంగలు ఎవరు అన్నది? పోలీసులు పట్టుకోవడంలో వెనుకబడి ఉన్నారు. ఇంకా దొంగల కోసం గాలిస్తున్నమంటూ చెప్తున్నారు తప్ప దొంగతనాలు పాల్పడ్డ దొంగలు ఎవరన్నది ఇప్పటివరకు పోలీసుల విచారణలో తేలలేదు.

తాజాగా బోధన్ లో పట్టపగలే బాన్సువాడ తరహాలో కారులో నుంచి మూడు లక్షలు దొంగలించుకుని పారిపోయారు.  నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో . గోశాల రోడ్డులోని యూనియన్ బ్యాంకు ఎదుట పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేసి, కారులో ఉన్న సుమారు 3 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. జాడి గ్రామానికి చెందిన హరిబాబు బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టుకోగా ఈ ఘటన చోటుచేసుకుంది.

తాజాగా బుధవారం ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అబ్దుల్ రషీద్ తన కూతురు వివాహం కొరకు ఎస్బిఐ బ్యాంకు నుండి 3 లక్షల రూపాయలు డ్రా చేసుకొని ద్విచక్ర వాహనంలో నగదును పెట్టుకొని ఓ దుకాణం వద్ద వాహనాన్ని నిలిపి సామాన్లు తీసుకొని తిరిగి వచ్చేసరికి అందులో నుండి రెండు లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు బాయ్ గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొనీ  ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇంత చోరీలు జరుగుతున్న పోలీస్ నిఘా నేత్రాలు పనిచేయకపోవడం పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతోనే చోరీలు జరుగుతున్నాయని ప్రజలు పాపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ లు ప్రత్యేక నిగా పెట్టాలని కరెన్సీ చోరీల ముఠాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇక్కడ కారు.. అక్కడ బైక్ 

షాపింగ్ మాల్, స్మార్ట్ బజార్లు, సూపర్ మార్కెట్లో, షోరూంల వద్ద ఇటీవల కొన్ని రోజులుగా సినీ పక్కిలో చోరీలు జరుగుతున్నాయి. అతి చాకచక్యంతో చోరులు నగదును దొంగిలించకపోతున్నారు. గత నెల క్రితం బాన్సువాడ స్మార్ట్ బజార్ ఆవరణలో పార్కింగ్ చేసిన కారులో నుండి దొంగలు చాకచక్యంగా  నగదును దోచుకెళ్ళిపోయారు. అదే తరహాలో జహీరాబాద్ లో బైకు నుండి లక్షల రూపాయల నగదును చోరీ జరిగిన సంఘటన జరిగింది.

ఇలా ఎక్కడో ఒకచోట దొంగలు తమ ప్రతాపాన్ని చూపుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నారు. ఒక చోరీ మిస్టరీని వీడక ముందే మరో చోరీ ఘటన చోటు చేసుకోవడం పోలీస్ అధికారులకు తలనొప్పిగా మారింది. నేటికీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ తాడ్కోల్ చౌరస్తా వద్ద కారులో ఉన్న 8 లక్షల రూపాయల నగదును చోరీకి పాల్పడి నెల రోజులు కావస్తుంది, ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పట్టపగలే నగదు చోరీ చోటు చేసుకుంది.

ఓ రైతు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం 8 లక్షల రూపాయల నగదు ను ఎస్బిఐ బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని,బైక్ డిక్కీలో ఉంచగా బైక్ డిక్కీ నుంచి గుర్తుతెలియని దొంగలు ,8 లక్షల రూపాయలు నగదును పట్ట పగలే చోరీకి పాల్పడ్డారు. పని నిమిత్తం బైకు అక్కడ పెట్టి వెళ్లిన పది నిమిషాలకే బైక్ డిక్కీ లో నుంచి 8 లక్షల రూపాయలు అపహరించుకొని పోయిన దొంగలు. నేటికీ నెల రోజులు కావస్తున్నా కారులో నుంచి నగదును దొంగలించిన దొంగలు ఎవరు? అన్నది ఇప్పటికీ పోలీసులు చేదించలేదు.

కేసు పురోగతి ముందుకు సాగడం లేదు.  ఈ ఘటనలు చూస్తే బాన్సువాడలో చేసిన దొంగలే జహీరాబాద్ లో బైక్ డిక్కిలో నుంచి 8 లక్షల రూపాయలను దొంగలించుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బోధన్ ఎల్లారెడ్డి లో కూడా ఈ దొంగతనాలకు పాల్పడింది కర్ణాటక ప్రాంతానికి చెందిన దొంగలే అయి ఉంటారని పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

వరుస ఘటనలతో ఆందోళన గురవుతున్న ప్రజలు..

పట్టపగలు వాహనాల నుండి నగదు చోరీ కావడం వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు కార్లలో డబ్బులు ఉంచడం షాపింగ్ కు వెళ్లడం ముఠా విక్కి నిర్వహించి చోరీలు పాల్పడడం పోలీసులకు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా బ్యాంకుల నుండి డబ్బు డ్రా చేసుకొని ఇంటికి వెళ్లే గ్యారెంటీ లేకుండా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇలాంటి వరుస సంఘటనలు ఎక్కడ చూసినా చోటు చేసుకోవడంతో పోలీస్ వ్యవస్థ అప్రమత్తమై కరెన్సీ చోరీ మాఫియా ముఠాను వెంటనే పట్టుకొని బాధితుల డబ్బులను రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.