30 May, 2026 | 9:45 PM

Breaking News

కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి, కార్మికులకు అండ, సీఐటీయూ

30-05-2026 08:43 PM

జిల్లా నాయకులు చింతకింది అశోక్ 

ఘనంగా 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఐదు దశాబ్దాలకు పైగా రాజి లేని పోరాటాలతో కార్మికుల పక్షాన నిలిచిన ఏకైక శక్తి సీఐటీయూ అని మేడ్చల్ జిల్లా భవన నిర్మాణ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకింది అశోక్ అన్నారు. శనివారం బాలాజీ నగర్ లో సీఐటీయూ 56 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా లేబర్ అడ్డా వద్ద కాప్రా సర్కిల్ భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు దావత్ నాగేష్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ 1970 మే 30న ఏర్పాటైన సిఐటియు నేడు 56 వ వసంతంలోకి అడుగు పెట్టిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది శ్రామికులకు అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. కార్మికులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.