4 May, 2026 | 12:23 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

గ్రూప్-2 ఫలితాల్లో 143 ర్యాంక్ సాధించిన మహేష్ గౌడ్ ను సన్మానించిన మంథని సీఐ రాజు

07-10-2025 07:39 PM

మంథని (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని సీతంపల్లి గ్రామానికి చెందిన గంట మహేష్ గౌడ్ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో 143 ర్యాంక్ సాధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన సందర్భంగా మంగళవారం మంథని పోలీస్ స్టేషన్ లో మంథని సీఐ రాజు మహేష్ గౌడ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహేష్ పేద కుటుంబం నుండి వచ్చి చదువులో సత్తా చాటుతున్నాడని, అతనిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కూడా చదువులో రాణించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మహేష్ సూపరింటెండింగ్ ఇంజినీర్ పెద్దపల్లిలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా గ్రూప్-3 ఫలితాల్లో 21 ర్యాంకు సాధించాడు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రిపరేషన్ సమయంలో మార్గదర్శిగా ఉన్న మహావాది సతీష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.