4 July, 2026 | 1:02 AM

జేమ్స్ కోల్స్, టంగ్‌లకు పిలుపు

04-07-2026 12:12 AM

భారత్‌తో వన్డేలకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

లండన్, జూలై 3: భారత్‌తో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.  ఆల్రౌండర్ జేమ్స్ కోల్స్కు తొలిసారిగా వన్డే జట్టులో చోటుదక్కింది. వన్డేలలో ఇంకా అరంగేట్రం చేయని ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్, గత ఏడాది నవంబర్‌లో చివరిసారిగా ఈ ఫార్మాట్‌లో ఆడిన జో ఫ్రా ఆర్చర్లకు కూడా జట్టులో చోటు ద క్కింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన శ్రీలంక పర్యటనకు దూరమైన పేసర్లు గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్ తిరిగి జట్టులోకి వచ్చారు.

హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు భారత్‌తో తలపడనుంది. జనవరి, -ఫిబ్రవరిలో శ్రీలంకలో పర్యటించిన 15 మంది సభ్యుల జట్టుతో పోలిస్తే, ఇంగ్లాండ్ 4 మార్పులు చేసింది. బ్రైడన్ కా ర్స్, జాక్ క్రాలీ, జేమీ ఓవర్టన్, ల్యూక్ వుడ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, మహమూద్, కోల్స్ జట్టులోకి వచ్చారు. మరో వైపు టీమిండి యా కూడా బలమైన జట్టును బరిలోకి దింపుతోంది. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. 

భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు..

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, ఆర్చర్,  అట్కిన్సన్, టామ్ బాంటన్, బెథెల్, బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కర్రన్,  డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్.